
Local UpdatesHyderabad3 min read
➡️లక్డీకాపూల్‌లో కొత్తగా వన్-వే అమలుకు కసరత్తు ➡️బైక్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనర్ క్షేత్రస్థాయి పర్యటన ➡️వన్ వే సాధ్యాసాధ్యాల పరిశీలన ✳️నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్‌ను మరింత సు
Added to Nesh: · Hyderabad · Local Updates
Source: X (@hydcitypolice)
Shared on NeshSource: X (@hydcitypolice)
Read original➡️లక్డీకాపూల్‌లో కొత్తగా వన్-వే అమలుకు కసరత్తు ➡️బైక్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనర్ క్షేత్రస్థాయి పర్యటన ➡️వన్ వే సాధ్యాసాధ్యాల పరిశీలన ✳️నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు కొత్తగా వన్-వే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ✳️ఈ మేరకు క్షేత్రస్థాయి పరిస్థితులు, వన్-వే సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు శుక్రవారం బైక్‌పై పర్యటించారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయెల్ డేవిస్, ఐపీఎస్, డీసీపీ-1 అవినాశ్ కుమార్, ఐపీఎస్ లతో కలిసి ద్వారకా హోటల్, పాత సైఫాబాద్ పీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్ చౌరస్తా, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్ పరిధిలోని రహదారుల స్థితిగతులను, వాహనాల రద్దీని ఆయన నిశితంగా పరిశీలించారు. ప్రమాదాల నివారణకు, వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు వీలుగా పలు కీలక సూచనలు చేశారు. ✳️ఈ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం.. ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి సికింద్రాబాద్ చేరుకోవాలనుకునే వాహనాలను రవీంద్రభారతి నుంచి నేరుగా అనుమతించకుండా.. హెచ్‌డీఎఫ్‌సీ, పాత సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్, సచివాలయం జంక్షన్ మీదుగా దారి మళ్లిస్తారు. ✳️అలాగే నిరంకారీ జంక్షన్ నుంచి ఓల్డ్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లాలనుకునే వాహనాలు నేరుగా హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్ వైపు వెళ్లకుండా.. పాత సైఫాబాద్ పీఎస్ వద్ద మళ్లించి ఇక్బాల్ మినార్ మీదుగా కుడి మలుపు తీసుకుని రవీంద్రభారతి ద్వారా ఓల్డ్ కంట్రోల్ రూమ్ కు పంపనున్నారు. ✳️ఇక సచివాలయం జంక్షన్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి పాత సైఫాబాద్ పీఎస్ వైపు వెళ్లే వాహనాలు నేరుగా కాకుండా.. ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ వద్ద యూ-టర్న్ తీసుకుని అసెంబ్లీ గేట్ నెం.3, రవీంద్రభారతి, హెచ్‌డీఎఫ్‌సీ మీదుగా పాత సైఫాబాద్ పీఎస్ వైపు వెళ్లేలా మార్గాలను ఖరారు చేశారు. ✳️ఈ వన్-వే విధానం సజావుగా సాగేందుకు త్వరలోనే జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖలతో పాటు ఇతర భాగస్వామ్య విభాగాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొదట దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాతే శాశ్వత అమలుపై నిర్ణయం ఉంటుందన్నారు. ✳️హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సరళీకరణ కోసం ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ అవసరాన్ని బట్టి వన్ వేల అమలును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్‌ను శాస్త్రీయంగా నియంత్రించేందుకు నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, సురక్షిత ప్రయాణం కోసం వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ✳️లక్డీకాపూల్ పరిశీలన అనంతరం నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్ గారు.. ఇప్పటికే వన్-వే అమల్లో ఉన్న కేబీఆర్ పార్క్ మార్గాన్ని పరిశీలించారు. అక్కడ వాహనాల రాకపోకలు మరింత సాఫీగా సాగేలా, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన వన్-వే మార్గమంతా స్వయంగా బైక్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను, ప్రస్తుత ట్రాఫిక్ నిర్వహణను నిశితంగా పరిశీలించారు. ✳️ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ మార్గంలో వాహనాలు ఆగకుండా సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెరుగుతున్న రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ప్రస్తుతం ఉన్న వన్-వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్ లేన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ✳️అదనపు లేన్ ఏర్పాటుకు ఆటంకంగా మారిన భూగర్భ పైపులైన్లు, విద్యుత్ స్తంభాలు తదితర యుటిలిటీలను యుద్ధప్రాతిపదికన తరలించేందుకు సంబంధిత విభాగాలు తగిన చర్యలు తీసుకుంటాయని వివరించారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వాహనదారుల ప్రయాణం సులభంగా సాగేలా.. ట్రాఫిక్ విభాగం, జీహెచ్‌ఎంసీ, నిర్మాణ సంస్థలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని స్పష్టం చేశారు.
This report has not been independently verified by Nesh.
